Poetry | Prose | Poems
My Diary
భాగ్యనగరపు వర్షపు చినుకు
వెతికేనట నీకోసం, తడుతూ
ప్రతి భావనపు తలుపు
కురిసెనట ఏం లాభం,
నగరపు ప్రతి వీధి మొదలు, మలుపు
చాలక తన చూపు,
సాయం కోరేనట చినుకు,
ఇంద్రుని తన మెరుపు.
ఉరుమే తోడై వెలిగెనట
ప్రతి ఇంటి పైకప్పు, వెతుకుతూ
నీ జాడకై, పడమర తూర్పు.
వినిపించలేదా వాటి పిలుపు,
నీ స్పర్శ కోసమేనట వాటి అరుపు
కనిపించమని అడుగుతోంది నిను,
భాగ్య నగరపు వర్షపు చినుకు.
అందించనా నీ జాడ తనకు,
కనికరించవా ఓ సారైనా నా కోరిక మేరకు
విహరిద్దాం వెన్నెలలో ఈ రాత్రి తుది వరకు
స్పృశిద్దాం మనసారా,
ఈ భాగ్య నగరపు వర్షపు చినుకు.
May 15, 2023